రాయదుర్గం: తాగునీరు సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం : BSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు
తాగునీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం గద్దె దిగాలని బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు డిమాండ్ చేశారు. రాయదుర్గం పట్టణంలో కనీసం నాలుగైదు రోజులకు ఒకసారి కూడా తాగునీరు సరఫరా చేయడంలేని దయనీయ పరిస్థితి నెలకొందన్నారు. సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో వందలాది మంది వినాయక కూడలిలో బైటాయించారు. మున్సిపల్ కమిషనర్ వచ్చి సమాధానం చెప్పేవరకూ నిరసన విరమించబోమని భీష్మించారు. సిఐ వెంకటరమణ జోక్యంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి అక్కడికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.