యర్రగొండపాలెం: కొమరోలు సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మరియమ్మ అక్కడికక్కడే మృతి
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం, కొమరోలు సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనము ఢీకొనడంతో మరియమ్మ అనే వృద్ధురాలు అక్కడికక్కడ మృతి చెందింది. రహదారి దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన వాహనం ఆమెను ఢీకొని ఆగకుండా వెళ్ళిపోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.