దర్శి: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన బీఎల్ఓ లను సస్పెండ్ చేసిన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ఐదు మంది బిఎల్ఓ లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వెస్ట్ నాయుడుపాలెం మొహమ్మద్ రఫీ, కల్లూరు శివ సుధాకర్ నమశ్శివాయ పురం రవికుమార్, కురిచేడు మేరీ, భోదనం పాడు సునీత లను సస్పెండ్ చేసినట్లు ఎంపీడీవో సత్యప్రసాద్ తెలిపారు. ఇందులో పంచాయతీ సెక్రటరీ ఇద్దరు ముగ్గురు అగ్రికల్చర్ అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు.