దర్శి: దర్శి సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు తెలిపిన డిఎస్పి బాలమురళీకృష్ణ
ప్రకాశం జిల్లా దర్శి సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సభలు సమావేశాలు ర్యాలీ ఊరేగింపులు చేయకూడదని డీఎస్పీ బాలమురళీకృష్ణ తెలిపారు. పోలీస్ చట్టం 1861 లోని సెక్షన్ 30 యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.