దర్శి: పోలవరం గ్రామంలో పర్యటించిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Apr 12, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరం గ్రామంలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పర్యటించారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు మహిళ మండల మాజీ అధ్యక్షురాలు కొర్రపాటి రమాదేవి ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గొట్టిపాటి లక్ష్మీ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఎవరు అధైర్యపడవద్దని వారికి ధైర్యాన్ని కల్పించారు.