గిద్దలూరు: రాచర్ల మండలంలో భారతీయ న్యాయ శాస్త్రాలపై దొంగతనాలు రోడ్డు ప్రమాదాలు అరికట్ట విషయంలో పోలీసులు ప్రజలకు అవగాహన
భారతీయ న్యాయ చట్టాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఆదివారం మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలో రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజలకు మారిన చట్టాలపై అవగాహన కల్పించి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. 2024 జులై 1వ తేదీ నుంచి ఐపీసీ సెక్షన్ నుంచి బీఎన్ఎస్ చట్టంగా న్యాయ శాస్త్రం రూపాంతరం చెందిందని ప్రజలకు తెలిపారు. అనంతరం రోడ్డు ప్రమాదాలు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు తెలిపారు.