కొండపి: సింగరాయకొండ ఉలవపాడు మధ్య జిటి ఎక్స్ప్రెస్ పై మద్యం సీసాల దాడి, ఇద్దరు పైలట్లకు గాయాలు, రైల్వే పోలీసులు కేసు నమోదు
సింగరాయకొండ ఉలవపాడు మధ్య వెళ్తున్న జిటి ఎక్స్ప్రెస్ రైలుపై గుర్తుతెలియని ఆకతాయిలు మద్యం సీసాలు విసరడంతో రైల్ ఇంజిన్ లోని ఇద్దరు పైలెట్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉలవపాడు రైల్వే ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం గాయపడ్డ పైలెట్లను విజయవాడకు తరలించారు. అయితే ఎదురుగా వస్తున్న రైలు నుంచి ఎవరు ఆకతాయిలో ఈ మద్యం సీసాలు ఆహార పొట్లాలు విసిరినట్లుగా రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శనివారం తెలిపారు. ప్రయాణికులు ఎవరు ఇటువంటి చర్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.