కొండపి: సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి స్వామి పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజానానికి నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి స్వామి ప్రజాప్రతినిధులు అధికారులు చేత ప్రతిజ్ఞ చేయించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంతోపాటు భావితరాల ప్రజలుకు యువతకు మనం మెరుగైన పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. తర్వాత చెత్త సేకరించి రిక్షాలను డస్ట్ బిన్ లు అందజేశారు.