మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బెంగళూరుకు చెందిన జిఈ హెల్త్ కేర్ కంపెనీ సహకారంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించామని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెనుకబడిన ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది అన్నారు. అందులో భాగంగా ఐటిఐ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు.