కొండపి: సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం పై విచారం వ్యక్తం చేసిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు రైలు కిందపడి మృతి చెందడంపై మంత్రి స్వామి తీవ్ర దిబ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అసలు ఎందుకు ఈ ఘటన జరిగిందో సంబంధిత అధికారులు విచారణ చేపట్టాలని కోరినట్లు మంత్రి అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు