మార్కాపురం జిల్లా దోర్నాల మండలం నల్లకుంట్ల చెంచుగూడెం లో ప్రమాదవశాత్తు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి వద్ద కట్టెల పొయ్యి పై వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు మంటలు అంటుకోవడంతో నిమ్మల మూగమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.