మార్కాపురం: పొదిలి ఓ కళ్యాణ మండపంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
పొదిలిలోని ఓ కళ్యాణ మండపంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్ విజయ సునీత అందజేశారు. ప్రజల నుండి తీసుకున్న అర్జీలను పరిశీలించి వారి యొక్క సమస్యలను నాలుగు వారాలలో పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ముందుగా కార్యక్రమంలో పాల్గొనేందుకు బస్సులో వచ్చిన వారికి అధికారులు ఘన స్వాగతం పలికారు.