దర్శి: కొత్తపల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో రైతు అంజిరెడ్డి మృతి
Darsi, Prakasam | Jun 23, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అంజిరెడ్డి పొలంలో నీళ్లు కట్టేందుకు వెళ్లారు. మోటారు వేయడానికి వెళ్లిన అంజిరెడ్డి కాలుకు కరెంటు వైర్ చుట్టుకొని విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొన్నది.