కొండపి: సింగరాయకొండ మండల కేంద్రంలోని అన్నా క్యాంటీన్ జరిగిన సీఎం పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కేంద్రంగా సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. అలానే అన్న క్యాంటీన్లో నేడు ప్రజలందరికీ ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేశారు. కార్యకర్తలతో కలిసి మంత్రి స్వామి అన్న క్యాంటీన్లోనే భోం చేశారు.