గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన సర్ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ రమణబాబు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో సర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని కమిషనర్ రమణబాబు నిర్వహించారు. సిబ్బందితో కలిసి మున్సిపాలిటీలో పర్యటించి ఓటర్ల వెరిఫికేషన్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఈనెల 14వ తేదీలోపు ఓటు వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 31 వేలకు పైగా ఓట్లు ఉన్నాయని వీటన్నిటిని స్వయంగా సిబ్బంది ఇంటి వద్దకే వచ్చి వివరాలు సేకరిస్తారని అందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ రమణబాబు విజ్ఞప్తి చేశారు. గతంలో ఓట్లు ఎక్కడ ఉన్నాయో అనే విషయాన్ని కూడా వెరిఫికేషన్ చేయడంతో పాటు కొత్తవారి సేకరించబడతాయన్నారు.