మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ప్రజా వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, కలెక్టర్ విజయ సునీత శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నూతన జిల్లా, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, ఇంటింటికి కొళాయిలు ఏర్పాటు కల్పించిన సీఎం చంద్రబాబుకు ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.