రాయదుర్గం: గ్రామాభివృద్ధికి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక బలమైన పునాది : గుమ్మగట్ట టిడిపి మండల కన్వీనర్ కాలువసన్నన్న
గ్రామాభివృద్ధికి పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక బలమైన పునాది అని టిడిపి మండల కన్వీనర్ కాలువసన్నన్న అన్నారు. గుమ్మగట్ట (M) కలుగోడు పంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం సాధారణ గ్రామసభ నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలని కోరారు. పంచాయతీ అబివృద్ధి అధికారి మల్లికార్జున, దాసరి రాజకుమార్, రామాంజనేయులు, గోవిందప్ప, మల్లికార్జున, రామప్ప, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.