దర్శి: దర్శిలో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు
Darsi, Prakasam | May 23, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు. సమీపంలో ఉన్న ట్రాన్స్ఫారం రిపేర్ కావడంతో ఈ సమస్య ఏర్పడిందని విద్యుత్ శాఖ సిబ్బంది గుర్తించారు. వెంటనే నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడంతో ప్రజలు విద్యుత్ శాఖ సిబ్బందికి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.