జడ్చర్ల: జడ్చర్ల మండలం లో ఉద్ధృతంగా పోలేపల్లి చెరువు.. రాకపోకలు బంద్
జడ్చర్ల మండలం పోలేపల్లి చెరువు అలుగు పారడంతో పోలేపల్లి-కిష్టారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కిష్టారం గ్రామ ప్రజలు ఉదండాపూర్ రోడ్డు బాగా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా పాలమూరు మార్గం గుండా జడ్చర్లకు రావాల్సి వస్తోంది. దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.