జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని రంగనాయక ఆలయానికి పోటెత్తిన భక్తులు
జడ్చర్ల మండలంలోని రంగనాయక స్వామి వారి ఆలయం శ్రావణ భక్తులతో కిటకిటలాడింది. పవిత్రమైన శ్రావణమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. కొండపైకి వాహనాల రాకపోకలు పెరగడంతో మార్గమంతా రద్దీగా మారింది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ క్యూలైన్లలో నిలబడ్డారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రాంగణం భక్తుల సందడితో నిండిపోయింది