గిద్దలూరు: గిద్దలూరు లోని ఏబిఏం పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు లోని ఏబిఎం పాలెంలో ఎంపీపీఎస్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. పాఠశాల అభివృద్ధి కొరకు రూ.9.37 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పని పూర్తి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.