గిద్దలూరు: కంభం పట్టణంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి వాహనదారులను హెచ్చరించిన సిఐ మల్లికార్జున
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని కంభం సర్కిల్ సిఐ మల్లికార్జున వాహనదారులను హెచ్చరించారు: కంభం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనదారులకు ఆదివారం సీఐ మల్లికార్జున రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి తోపాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించి వాహనాలపై ప్రయాణించాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు వాహన సంబంధిత పత్రాలు దగ్గర ఉంచుకోవాలన్నారు. మైనర్లు వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే వాహనం నడిపిన మైనర్ తో పాటు వాహనం ఇచ్చిన యజమాని కూడా నేరస్తులు అవుతారని హెచ్చరించారు.