కొండపి: టంగుటూరు సమీపంలోని ఒంగోలు చెన్నై రైల్వే ట్రాక్ వంతెనకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తి
ప్రకాశం జిల్లా టంగుటూరు లోని చెన్నై ఒంగోలు రైల్వే ట్రాక్ వంతెన కు గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మంగళవారం జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థానానికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియలేదని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి చేతి పై నాన్న అని పెద్ద పుట్టుమచ్చ ఉందని అధికారులు వెల్లడించారు.