తాడిపత్రి: రాయలసీమను రతనాల సీమగా చేస్తా: యాడికి లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. యాడికి లోని మార్కెట్ యార్డులో సోమవారం నీటి భద్రతపై -సాగునీటి సంఘాల బాధ్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి మాట్లాడారు. తాగు, సాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తాగు, సాగునీటి గురించి పట్టించుకోలేదన్నారు. విద్యుత్ చార్జీలను కూడా విపరీతంగా పెంచారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలను పెంచలేదన్నారు. ట్రూ ఆఫ్ చార్జీలను ట్రూ డౌన్ చార్జీలుగా మార్చామన్నారు. ప్రజా శ్రేయస్సు మాకు ముఖ్యమన్నారు.