మార్కాపురం: జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరు నెలల కాలంలో కోటి 43 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసామన్నారు. ఇవాళ 78 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్లను ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే కాలంలో కోట్లాది రూపాయలు నిధులు రాబోతున్నాయి. వాటితో పట్టణంలో రోడ్లు డ్రైనేజీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలోని శివారు ప్రాంతంలో సాగర్ పైప్ లైన్ల నిర్మాణం కోసం 78 కోట్ల టెండర్ పనులు కూడా పూర్తయినట్లు తెలిపారు. త్వరలో పనులు ప్రారంభిస్తారు అన్నారు.