మార్కాపురం: జిల్లా కేంద్రంలోని చెరువులో గుర్తుతెలియని మృతదేహం కలకలం
మార్కాపురం జిల్లా కేంద్రంలోని చెరువులో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. గుర్తుతెలియని మహిళా మృతదేహంగా గుర్తించారు. 40 సంవత్సరాలు ఉండవచ్చని చెరువులో పడి రెండు రోజులు కావడంతో మృతదేహం ఉబ్బి గుర్తుపట్టని పరిస్థితుల్లో ఉందని పోలీసులు తెలిపారు. మృతురాలు ఏదైనా కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నదా లేక హత్య చేసి చెరువులో వేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.