మార్కాపురం: రేషన్ కార్డు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన బాధితురాలు అక్కమ్మ
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పొదిలి మండలం కంబాలపాడు గ్రామానికి చెందిన అక్కమ్మ రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విజయ సునీత కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు సంవత్సరాలుగా రేషన్ కార్డు లేదని ప్రభుత్వ కార్యాలను చుట్టు తిరిగిన తమకి ఇంతవరకు కార్డు రాలేదు అన్నారు. తన పేరు మీద మరొకరు ఉండి చనిపోవడం వల్ల తన పేరు నమోదు చేస్తే చనిపోయినట్లుగా చూపిస్తుందని అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమకు రేషన్ కార్డు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు.