రాయదుర్గం: పట్టణంలోని రీక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో జింక అనుమానాస్పద స్థితిలో మృతి
రాయదుర్గం పట్టణంలోని రీక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో జింక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం ఉదయం క్లబ్ లోకి వెళ్లిన కొందరు జింక కళేబరం గుర్తించారు. వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటన స్థలానికి బయలుదేరారు. ఆహారం కోసం వచ్చి ప్రమాదవశాత్తు మరణించిందా లేక కుక్కల దాడిలో మరణించిందా అనే విషయం ఫారెస్టు అధికారుల విచారణలో తెలియాల్సి ఉంది.