రాయదుర్గం: బాల్యవివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు : దిశ డిఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరిక
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమేనని, ప్రోత్సహిస్తే చట్టప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని దిశ డిఎస్పీ మహబూబ్ బాషా హెచ్చరించారు. మహిళలు, బాలబాలికల బద్రత పై రాయదుర్గంలో స్థానిక డిఎస్పీ రవిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాయదుర్గం ప్రాంతంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారు. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ కృషి చేస్తోందని వివరించారు.