గిద్దలూరు: కొమరోలు మండలంలో జూన్ 1వ తేదీన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో జూన్ 1వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆదివారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా కొమరోలు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పురుషోత్తముని పల్లి, కే బొంతపల్లి, తాతిరెడ్డిపల్లి, సర్వేరెడ్డిపల్లి గ్రామాలలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు