రాయదుర్గం: డబుల్ ఇంజన్ సర్కారు తోనే అభివృద్ధి : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక వసుంధరా దేవి
డబల్ ఇంజన్ సర్కారు ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ప్రజలు ఎన్డిఏ కు పట్టం కొడుతున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక వసుంధరా దేవి అన్నారు. మూడు రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం పై రాయదుర్గంలో సోమవారం సాయంత్రం సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ లో మెదటి సారి, పుదుచ్చేరి లో రెండవ సారి, అస్సాం లో మూడవ సారి విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. మోడీ పాలనపై ప్రజల్లో పూర్తి విశ్వాసం వ్యక్తం అవుతోందని బిజెపి పాలనలోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని స్పష్టం చేశారు.