యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం పరిధిలో 41 మొబైల్ ఫోన్లను రికవరీ చేసిన సీఐ అజయ్ కుమార్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడంలో స్పెషల్ ఫోకస్ పెట్టారు. పది రోజులు వ్యవధిలో విస్తృతంగా గాలించి 41 మొబైల్ ఫోన్ లను రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో పోలీసుల కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.