కనిగిరి: పామూరు యాక్సిస్ బ్యాంకులో రూ. 2.49 కోట్ల నగదు మోసం, ఇద్దరు బ్యాంకు ఉద్యోగుల అరెస్ట్: డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్
పామూరు యాక్సిస్ బ్యాంకులో ఖాతాదారులను మోసం చేసి, రూ.2.49 కోట్ల నగదును కాల్ చేసిన బ్యాంకు మేనేజర్ తో పాటు అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్ ను అరెస్టు చేసినట్లు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. పామూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో యాక్సిస్ బ్యాంకులో మేనేజర్ పనిచేసిన వ్యక్తితో పాటు అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్ గా పనిచేసిన వ్యక్తి ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్లకు ఫేక్ బాండ్స్ ఇచ్చి వారి నగదు కాజేసారన్నారు. 2023 నుండి ఈ ఫ్రాడ్ మొదలైందన్నారు. బ్యాంకులో పనిచేస్తున్న అసిస్టెంట్ మేనేజర్ తిరుపతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.