యర్రగొండపాలెం: చిట్టడివిని తలపిస్తున్న పెద్దారవీడు మండలం కలనూతల గ్రామస్తుల పునరావస కాలనీ
వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించి 30 సంవత్సరాలు అవుతుంది. ముంపు గ్రామ ప్రజలకు పునరావస కాలనీలు ఏర్పాటు చేశారు. మార్కాపురం మండలం ఇడుపూరు సమీపంలో పెద్దారవీడు కలనూతల గ్రామస్తులకు అంగన్వాడి కేంద్రం, పాఠశాల, చర్చి, దేవాలయాలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. నిర్మాణాలు పూర్తయి కొన్ని సంవత్సరాలు కావడంతో కాలనీ చిట్టడవిని తలపిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. పట్టించుకున్న నాధుడే లేరని నిర్వాసితులన్నారు