దర్శి: దర్శి పోలేరమ్మ ఆలయంలో ఘనంగా జలాధివాస కార్యక్రమం
Darsi, Prakasam | May 15, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులో వెలిసిన శ్రీ పోలేరమ్మ ఆలయంలో జలాధివాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో అమ్మవారికి జలాలతో అభిషేకం నిర్వహించినట్లు అమ్మవారి మహిళా పూజారి హేమలత తెలిపారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గ్రామంలోని ప్రజలంతా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినట్లు తెలిపారు.