కొండపి: సింగరాయకొండ జివిఆర్ ఫ్యాక్టరీ సమీపంలో డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడ్డ కంటైనర్ లారీ, డ్రైవర్కి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ జివిఆర్ ఫ్యాక్టరీ సమీపంలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి కంటైనర్ లారీ మంగళవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ గాయపడ్డాడు. గాయపడ్డ డ్రైవర్ని అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తుతో డ్రైవర్ వాహనం నడిపి ప్రాంతానికి కారణమయ్యాడని పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్కుకు అంతరాయం కలగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు.