యర్రగొండపాలెం: రీ సర్వేలో ప్రభుత్వ భూమిని తొలగించిన వారికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గొల్లవిడిపి గ్రామానికి చెందిన 26 మంది బాధితులు ప్రభుత్వ భూమి కేటాయించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. రైతు సంఘం నాయకులు వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్రభుత్వ భూమిని రీ సర్వేలో పేర్లు తొలగించడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమిని కేటాయించాలని సంవత్సరం నుండి అనేకసార్లు కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చామన్నారు.