రాయదుర్గం: చెత్త రహిత స్వచ్చ గ్రామాలే లక్ష్యం : రాయదుర్గం MPDO కొండన్న
గ్రామాలను చెత్త రహిత స్వచ్చ గ్రామాలుగా తీర్చి దిద్దుతామని రాయదుర్గం MPDO కొండన్న తెలియజేశారు. స్వచ్చపథం కార్యక్రమంలో బాగంగా మండలంలోని బిఎన్ హళ్లి గ్రామంలో బుధవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. రోడ్డు పక్కన ఉన్న చెత్త దిబ్బలను తొలగించి శుభ్రం చేయించారు. పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది, గ్రీన్ అంబాజిడర్లు, స్థానికులు భాగస్వాములయ్యారు. ప్రతీ బుధవారం ఒక గ్రామంలో స్వచ్చత కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. అలాగే తడిచెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. రోడ్డు పక్కన చెట్లు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలియజేశారు.