రాయదుర్గం: 75 వీరాపురంలో బెట్టింగ్ ఆడుతున్న 12 మంది అరెస్టు : సిఐ వెంకటరమణ
గుమ్మగట్ట మండలంలోని 75 వీరాపురం గ్రామంలో జూదం ఆడుతున్న 12 మందిని అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. పక్కా సమాచారంతో మంగళవారం పోలీసులు ఆ గ్రామంలో బెట్టింగ్ ఆడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని తెలిపారు. వారి వద్ద నుండి 1 లక్ష 5 వేల రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యువత బెట్టింగ్ ఉచ్చులో పడి అప్పులపాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వీరిపై నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతుంటే స్థానిక పోలీసులకు గాని లేదా 9440796825 నెంబర్ కు పోన్ చేసి గానీ తెలిపాలన్నారు.