రాయదుర్గం: వడ్రహొన్నూరు వద్ద హైవేపై లారీ, ట్రాక్టర్ డీకొన్న ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమం
రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు సమీపంలో అనంతపురం జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం లారీ, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వడ్రహొన్నూరు గ్రామానికి చెందిన విజయ్, బాలు అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు సిఫార్సు చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.