రాయదుర్గం: పైప్ లైన్ పగలడానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసిన కణేకల్లు పోలీసులు
కణేకల్లు వద్ద ఈనెల 3న HLC రోడ్ కమ్ బ్రిడ్జ్ వద్ద హగరి నదిలో PABR డ్యామ్ నుండి రాయదుర్గం పంప్‌హౌస్‌కు వెళ్లే తాగునీటి మెయిన్ పైప్‌లైన్‌పై ఒక వ్యక్తి ట్రాక్టర్ నడపడంతో పైప్ పగిలిన ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 114 గ్రామాలకు తాగునీరు సరఫరా నిలిపోయిన ఘటనపై వచ్చిన వార్త కథనాలపై ఆర్డబ్ల్యూఎస్, పోలీసులు అధికారులు స్పందించారు. కళ్యాణదుర్గం RWS&S అసిస్టెంట్ ఇంజినీర్ ఫిర్యాదుతో కనేకల్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పైప్‌లైన్‌ను డ్యామేజ్ చేసిన ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన రాంపురం ఎర్రిస్వామిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.