రాయదుర్గం: పట్టణంలో పిచ్చి కుక్క భీభత్సం, దాడిలో 40 మందికి గాయాలు
రాయదుర్గం పట్టణంలో శనివారం పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. ఓబుళాచారి రోడ్డు, నేతాజీ రోడ్డు, నేసేపేట, బళ్లారి రోడ్డు ప్రాంతాల్లో స్వైర విహారం చేస్తూ 40 మందిని కరచి గాయపరిచింది. గాయపడిన వారు యాంటీ రేబిస్ ఇంజక్షన్ల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కట్టారు. చిన్నారులు, వృద్ధులు కూడా బాధితులుగా ఉన్నారు. కుక్కను పట్టుకోవడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కుక్కను బంధించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.