గిద్దలూరు: గిద్దలూరులో రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తికి 8 నెలలు జైలు శిక్ష విధించిన గిద్దలూరు కోర్టు, బాధితుడికి నష్టపరిహారం
మార్కాపురం జిల్లా గిద్దలూరు, పోరుమాముల రహదారిలో 2022 లో నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ వ్యక్తికి న్యాయమూర్తి భరత్ చంద్ర 8 నెలలు జైలు శిక్ష విధించారు. కలసపాడు కు చెందిన మోదల శ్రీను నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహబూబ్ షరీఫ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి సాక్షాదారాలను గిద్దలూరు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసుని విచారించిన న్యాయమూర్తి భరత్ చంద్ర... నేరం రుజువు కావడంతో నిందితుడికి 8 నెలలు జైలు శిక్షతోపాటు రూ30 వేలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పించారు.