కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో రోజు మార్చి రోజు పొగాకు కొనుగోలు జరుగుతాయని వేలం నిర్వహణ అధికారి శంకర్రావు వెల్లడి
కొండపి పొగాకు వేలం కేంద్రంలో కొనుగోళ్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోజు మార్చి రోజు జరుగుతున్నట్లు వేలం నిర్వహణాధికారి శంకరరావు తెలిపారు. వేలం కేంద్రంలో కొనుగోలుదారుల మధ్య పోటీతోనే కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోటీ లేకుండా వారు అనుకున్న ధరకు కొనుగోలుచేసే పరిస్థితి వస్తే వేలాన్ని ఆపుతామని రైతులకు భరోసానిచ్చారు. రైతులకు అన్యాయం జరగకుండా వేలం సజావుగా జరిగేలా చేస్తామని వెల్లడించారు.