యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో సీఎం సహాయనిది చెక్కులను టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు. సుమారు 29 మంది లబ్ధిదారులకు 36.93 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యం ప్రమాదాలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు ఈ సహాయనిది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. పేదల సంక్షేమమే టిడిపి ప్రభుత్వ లక్ష్యమని అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.