శాయంపేట: శాయంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి
హన్మకొండ జిల్లా శాయంపేట మండలం కొత్తగట్టు-సింగారం రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ యజ్జెల శ్రీను(25) మృతి చెందారు. పరకాల నుంచి హనుమకొండ వెళ్తున్న ట్రాక్టర్ను లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పరకాల మార్చురీకి తరలించారు.