మార్కాపురం: పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని జిల్లా కేంద్రంలో సిపిఐ సిపిఎం రాస్తారోకో
మార్కాపురం జిల్లా కేంద్రంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యవసర ధరల పెంపుకు వ్యతిరేకంగా రాస్తారోకో చేశారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకు పనులు తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలపై పన్నుల రూపంలో సాధారణ ప్రజల నుండి గుంజుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 31 శాతం పన్నుతో పాటు నాలుగు రూపాయలు వ్యాట్ ను, లీటర్ కి ఒక రూపాయి చొప్పున రోడ్డు పన్ను వసూలు చేస్తూ దేశంలోనే అత్యంత అధిక పన్ను వసూలు చేస్తుందని అన్నారు. సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య మాట్లాడుతూ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలన్నారు.