దర్శి: మారెళ్ళ గ్రామంలో అంకాలమ్మ తిరుణాలలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారేళ్ల గ్రామంలో అంకాలమ్మ తిరునాళ్ల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఆలయ పూజారి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆమెకు ఆశీర్వచనాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.