మార్కాపురం: సుందరయ్య కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులు లేక అవస్థలు పడుతున్న విద్యార్థులు #localissue
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని కాలనీవాసులు తెలిపారు.సుమారు 70 మంది విద్యార్థులు ఉండగా మరుగుదొడ్లు కూర్చోవడానికి గదులు త్రాగడానికి మంచి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కాలనీ ఏర్పడి 20 సంవత్సరాలు అవుతున్నా సరైన వసతి లేక అద్దె రేకుల షెడ్డులో పాఠశాల నడుపుతున్నట్లు తెలిపారు. వర్షం పడితే కూర్చోవడానికి స్థలం కూడా లేదని వాపోయారు.