యర్రగొండపాలెం: దేవరాజు గట్టు నాగవరపు ఎల్లమ్మ తల్లి కొలుపుల లో పాల్గొన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్
పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న నాగవరపు ఎల్లమ్మ తల్లి కొలుపుల మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.